కరోనా దెబ్బకు అన్ని వ్యవస్థల్లానే సినీ పరిశ్రమ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. యాక్టర్స్, కార్మికులు, డిస్ట్రిబ్యూషన్, ధియేటర్ స్టాఫ్.. ఇలా చాలా మంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. సినిమా షూటింగ్స్ పర్మిషన్ వచ్చింది కాబట్టి షూటింగ్స్ జరుగుతాయి. కానీ.. ధియేటర్లు తెరిచాక సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు గతంలోలా ధియేటర్లకు వస్తారా.. అనేదే ప్రశ్న. ఈ విషయమై కొందరు నిర్మాతలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు భారీ బడ్జెట్ సినిమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను సలహాలను ఇస్తున్నారట.

IHG's fault

 

భారీ బడ్జెట్ సినిమా ఆలోచనలు ఇప్పట్లో చేయకపోవడమే బెటరని సన్నిహితులతో అంటున్నారట. ఈ విషయంపై అల్లు అరవింద్, రామ్ చరణ్ లతో కూడా చర్చించారట. ఇకపై చేసే సినిమాలకు కాస్ట్ కటింట్ చాలా ముఖ్యమని చెప్పారట. ఈ మధ్య చాలమందితో కూడా ఇదే విషయమై సలహాలు ఇస్తున్నారట. ప్రేక్షకులు ఇదివరకటిలా సినిమాలు చూస్తారా అనే ప్రశ్నకు చాలా కారణాలు విశ్లేషించారట. ఆర్ధిక పరిస్థితులు, కరోనా భయం, వ్యక్తిగత ఇంట్రెస్ట్.. ఇలా ఆలోచించే ఖర్చు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే బెటరని అందరితో అంటున్నారట. ఆచార్య సినిమాకు కూడా ఇకపై ఖర్చు తగ్గించాలని ఇప్పటికే చరణ్ కు సూచించారని సమాచారం.

IHG

 

పైగా.. ధియేటర్లు తెరిచినా సీట్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని ధియేటర్లు ఆ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనాలు వచ్చినా కలెక్షన్లు అంతగా రావనే లెక్కలు కూడా వేస్తున్నారట. ఇన్ని కోణాల్లో ఆలోచిస్తుంటే పరిస్థితులు పాజిటివ్ గా ఎవరికీ కనిపించటం లేదు. ఇటివల సురేశ్ బాబు మాట్లాడుతూ.. చైనాలో ధియేటర్లు ఓపెన్ చేస్తే ఆక్యుపెన్సీ రేట్ 2శాతం మాత్రమే ఉందన్న వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. చిరంజీవి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని అంటున్నారు.

IHG's Comments!

మరింత సమాచారం తెలుసుకోండి: