రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తున్న మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి నెలరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇటువంటి తరుణంలో ఇటీవల సినిమా షూటింగులకు ప్రభుత్వాల నుండి పర్మిషన్ వచ్చిన పవన్ కళ్యాణ్ అప్పుడే సినిమా షూటింగులు స్టార్ట్  చేయవద్దు అని సినిమా యూనిట్ తో అన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. దాదాపు లాక్ డౌన్ వల్ల రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

IHG

ఇటువంటి సమయంలో అనుమతులు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారినట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే అనుమతులు వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఆగస్టు 15వ తారీఖున ఈ సినిమా రెడీ చేయాలనుకున్నారు దిల్ రాజు. అయితే సినిమా ధియేటర్ లు ఇంకో నాలుగు నెలల పాటు తిరిగి ఓపెన్ చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ నుండి వార్తలు బలంగా వినబడుతున్నాయి.

IHG

ఇలాంటి టైమ్ లో కంగారుపడి సినిమా షూటింగ్ మొదలు పెట్టి సినిమా కంప్లీట్ చేసుకుని సినిమా చేతిలో పెట్టుకోవడం వల్ల నిర్మాత లాస్ అవుతాడని పవన్ కళ్యాణ్ అన్నీ ఆలోచించి ఆగస్టు నెలలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి అంతా షురూ అయ్యాక సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇదే తరుణంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా నటించబోయే పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆగస్టు నెలాఖరులో సినిమా షూటింగ్ ప్రారంభించాలని పవన్ డిసైడ్ అయినట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: