కొంతమంది హీరోయిన్లు వావ్ అనిపించే రేంజ్ లో నటించారు.అప్పట్లో ఆహా అనిపించినా నటులు అంత కూడా ఇప్పుడు ఓహో అనిపించే రేంజ్ లో పడుకుంది. అమ్మ పాత్రల్లో, అక్క పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇంకా ఇప్పుడు పెద్ద తరం పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ భామలు. 

 

మిర్చి - నదియా 

 

 

ఎన్నో తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో మనం హీరోయిన్ గా చుసిన నదియా కాస్త బ్రేక్ తీసుకొని స్టయిల్ గా అమ్మ పాత్రల్లో అత్తా పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

 

కాంచనమ్మ - అర్జున్ రెడ్డి 

 

 

కాంచనమ్మ.. సావిత్రి టైమ్ లో హీరోయిన్.. అలాంటి కాంచనమ్మ మూడేళ్ళ క్రితం రిలీజ్ అయినా అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించింది. ఇంగ్లీష్ లో మాట్లాడి అందరిని అలరించింది. 

 

మధుబాల - నాన్నకు ప్రేమతో 

 

 

నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య సినిమాలో అమ్మ పాత్రలో నటించిన మధుబాల నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ తల్లి పాత్రలో నటించి అందరిని అలరించింది.

 

అమల అక్కినేని - లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 

 

 

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అమ్మ పాత్రే అయినప్పటికీ చాలా అంటే చాలా చిన్న పాత్రలో నటించి అమల ప్రేక్షకులను అలరించింది. 

 

భూమిక - లడ్డు బాబు

 

 

ఖుషి భూమిక ఎవరికి పరిచయం ఉండదు చెప్పండి. అన్ని భాషల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్క పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. 

 

మీనా - దృశ్యం 

 

 

వెంకటేష్, మీనా ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అలాంటి మీనా దాదాపు 20 ఏళ్ళ తర్వాత దృశ్యం సినిమాలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది.

 

రాసి - కల్యాణ వైభోగమే 

 

 

ఈ సినిమాలో హీరోయిన్ అమ్మ పాత్రలో అయితే నటించింది కానీ పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. 

 

ఆమని - భరత్ అనే నేను 

 

 

ఆ నలుగురు సినిమాలో నటించింది.. కానీ మళ్లీ బ్రేక్ తీసుకుంది. భరత్ అనే నేను సినిమాలో మంచి పాత్రలో నటించింది. 

 

సుప్రియ యార్లగడ్డ - గూఢచారి 

 

 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన ఈ భామ దాదాపు 22 ఏళ్ళ తర్వాత గూడచారి సినిమలో నటించి మంచి పేరు సంపాదించింది. 

 

వీళ్ళేనండీ రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ భామలు.. ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: