భారత దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గత వారం నుండి రోజుకు దాదాపు సగటున పది వేల మంది వైరస్ బారినపడుతుండగాఇప్పటికీ వేలల్లో వెంటిలేటర్ల పై ప్రాణాలతో పోరాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 9,987 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 331 మంది కరోనా కాటుకు బలయ్యారు. భారత్‌లో ఒకరోజు సంభవించిన మరణాలలో ఇదే అత్యధికం

 

గతంలో ఇటలో లో రోజుకు 900 మంది ప్రాణాలు విడుస్తుంతే వామ్మో అనుకున్నాం కానీ మన దేశంలో కూడా ఇప్పుడు రోజుకి దానిలో మూడవ వంతు ఊపిరి వదులుతున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ 7,466 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వెల్లడించింది. ఇప్పటి వరకు 2,66,598 మంది మహమ్మారి బారిన పడ్డారు…. ఇక రోజు కూడా మరో పది వేల మందికి కరోనా సోకి ఉంటుంది.

 

వైద్యులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించకపోవడం, అనవసరంగా బయట తిరగడం లాంటివి కరోనా వ్యాప్తికి మరో కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో కరోనా కేసులలో భారత్ 5 స్థానంలో ఉండగా, కరోనా మరణాలలో 12 స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా ప్రభావం ఇప్పుడే మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: