మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ ఓ తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో చిరు చేస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఒక 30 నిమిషాల పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. ఆచార్య సినిమాకు అసలు కథ చరణ్ టోన్ మొదలవుతుందని అంటున్నారు.  

 

ఇదిలాఉంటే ఆచార్య తర్వాత చరణ్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.. అయితే డైరక్టర్ ఎవరో తెలియని ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ మీడియా సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ అట.. ఓ ఊరిలో ఆస్తి కోసం ఒక పాప ప్రాణాలను తీయాలనే గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళ నుండి ఆ పాపని కాపాడే ప్రయత్నంలో చరణ్ ఏం చేశాడు అన్నది సినిమా కథ అని తెలుస్తుంది.  

 

మరి మీడియాలో వినిపిస్తున్న ఈ కథ నిజంగా చరణ్ కోసం రాసిన కథేనా.. ఇంతకీ ఈ కథ రాసింది ఎవరు.. సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదేదో పసివాడి ప్రాణం సినిమా కథలా ఉందని చరణ్ ఈ కథ చేయకుండా ఉంటేనే బెటర్ అని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా తన నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అయినా చరణ్ తన నెక్స్ట్ సినిమాల కథల గురించి కూడా చాలా కేర్ ఫుల్ గా ఉంటాడని తెలుస్తుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: