విశాఖ సినీ రాజధాని అవుతుందా. ఇప్పటికే పాలనా రాజధానిని చేయాలని వైఎస్ జగన్ ఆలోచన చేశారు. అయితే దానికి తోడు అన్నట్లుగా సినీ రాజధాని ముందు అయ్యేట్లుగా కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాది తరువాత తెలుగు సినిమా ప్రముఖులు ఆయన్ని నివాసంలో కలుసుకున్నారు.

IHG

 

ఈ సందర్భంగా వారి మధ్య టాలీవుడ్ ని విశాఖలో అభివ్రుధ్ధి చేయాలన్న చర్చ వచ్చింది.దానికి గానూ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కూడా అంటున్నారు. ఈ విషయంలో జగన్ కూడా విశాఖలో భూములు ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నారు. స్టూడియోలు కట్టుకుందామనుకుంటే తగిన సహాయం ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పారని అంటున్నారు.

 

IHG

 

అదే విధంగా సినిమా వర్గాలు విశాఖలో నివాశం ఏర్పాటు చేసుకుంటే వారికి ఉండేందుకు ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇవన్నీ చూసినపుడు విశాఖలో రాజధాని రావడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

IHG

 

మరి భూములు తీసుకున్న వారు స్టూడియోలు కట్టాలి. ఇక్కడే సెటిల్ అవాలి. వారు అంతా కలసి ఆలోచన చేస్తేనే ఇది సాధ్యమయ్యేది. భూములు తీసుకుని స్టూడియోలు కట్టకుండా ఉంటే మాత్రం అది ఇబ్బందే. ఇదిలా ఉండగా విశాఖలో రామానాయుడు స్టూడియో ఉంది. అది ఎపుడో ఇరవయి ఏళ్ళ క్రితం కట్టారు. 

IHG's Boons To <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> Film Industry

 

విశాఖలో సినీ యాక్టివిటీ పెరిగితే దానితో పాటు మరిన్ని స్టూడియోలకు కూడా పని దొరుకుతుంది. మొత్తం మీద జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ కే సినీ పరిశ్రమ పరిమితం కాకుండా విశాఖకు కూడా వస్తే బాగుంటుంది. ఆ దిశగా ఏ మాత్రం అడుగు ముందుకు పడినా హర్షించాల్సిందే.   ప్రభుత్వం ఇక్కడ చిత్తశుధ్ధితో ఉంది. అలాగే సినీ పెద్దలు కూడా ముందుకు వస్తేనే విశాఖ రాజధాని కల సాకారం అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: