మన టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే భారీ మల్టీ స్టారర్స్ కి నిర్మాతలు సిద్దమవుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుండి మన తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మల్టీ స్టారర్స్ రూపొందుతున్నాయి. ఈ సినిమాలో మొదటి సారి విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అందరు హీరోలలో ఒకరితో ఒకరు కలిసి నటించాలన్న ఉత్సాహం బాగా పెరిగిపోయింది. చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. 

 

IHG

 

మహేష్ బాబుతో కలిసి నటించిన వెంకటేష్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల చేశారు. ఈ కాంబినేషన్ కూడా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో పాటు భారీ కాన్వాయిస్ తో బాహుబలి ఫ్రాంఛైజీ ని తీసి తెలుగు సినిమా ఘనతను చాటి చెప్పారు. అంతేకాదు మరోసారి టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలతో ఆర్.ఆర్.ఆర్ ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

 

IHG'Khaidi No 150' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a> ...

 

అయితే ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారితో ఇండస్ట్రీలో ఊహించని మార్పులే కాదు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ఎక్కువగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాల మీద ప్రభావం చూపించబోతుంది. ఇప్పటి నుంచి పాన్ ఇండియా కేటగిరి అంటూ మేకర్స్ నిర్మించాలనుకున్న మల్టీ స్టారర్స్ ని నిర్మించడం కష్టమని తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలకే దాదాపు 70 నుంచి ఎనభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అంత రిస్క్ చేస్తారా అన్నది అనుమానమే. దానికి తోడు ఇండస్ట్రీలో హీరో.. హీరోయిన్స్ దగ్గర్నుంచి అందరు రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ రావడం కష్టమే అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: