టాలీవుడ్ లో హీరోలందరూ ఒక చోట కలవడం అంటే కష్టమైన విషయమే. వజ్రోత్సవాలు వంటి భారీ ఈవెంట్ ఏదైనా జరిగితే తప్ప సాధ్యం కానిది. కానీ.. ఓ క్రియేటర్ తన టాలెంట్ తో హీరోలందరినీ ఓ చోట చేర్చాడు. నిజంగా అనుకునేరు.. తన క్రియేటివిటీని ఆర్ట్ రూపంలో గీసి అందరినీ కలిపేశాడు. పైన చెప్పినట్టు భారీ ఈవెంట్ కాకపోయినా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును తన టాలెంట్ కు వేదిక చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ క్రియేటివిటీ క్యారికేచర్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది.

IHG

 

ఆమధ్య చిరంజీవి–బాలకృష్ణ ఓ ఫంక్షన్ లో కలుసుకుని ఒకే సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.  చిరంజీవికి సెల్ ఫోన్ చూపిస్తూ ఇద్దరూ నవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తన కొత్త సినిమా టీజర్ ను చిరంజీవికి చూపిస్తున్నట్టు క్రియేట్ చేసాడు. టీజర్ రిలీజ్, బాలయ్య బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ హీరోలందరూ ఓచోట కలుసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అందరి క్యారికేచర్లు గీసాడు. అందరూ తమ స్టైల్ ఆఫ్ మేకోవర్ లో అటెండ్ అయినట్టు క్రియేట్ చేశాడు. అక్కడే NBK 60 అని రాశాడు. చూసేందుకు ఎంతో కలర్ ఫుల్ గా ఉన్న ఆ ఫొటో చాలా బాగుందని చెప్పాలి.

IHG

 

నిజంగా హీరోలంతా ఇలా కలిస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు పులకించి పోవడం ఖాయం. మిగిలిన భాషల హీరోలూ అసూయపడేలా ఉంది ఆ క్యారికేచర్. హీరోలు ఒకొక్కరిదీ ఒక్కో విభిన్న శైలి. ఎవరికి వారు తమ టాలెంట్ తో రాణిస్తున్నా వారే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్యారికేచర్ ఆకట్టుకుంటోంది. అయితే.. ఇందులో వరుణ్ తేజ్, సాయి తేజ్ ను మిస్ చేయడమే కాస్త వెలితిగా ఉంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: