తాను తీసే ఎలాంటి సినిమా గురించి అయినా ఆడియెన్స్ ను ఆలోచించేలా చేయడం.. ఆ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసేలా చేయడం లాంటివి కొంతమంది దర్శకులు మాత్రమే చేయగల అది. అలాంటి ఐడియాలు వర్మ దగ్గర చాలా ఉన్నాయి అందుకే వర్మ సినిమాలు ఎలా ఉన్నా రిలీజ్ రోజు ఆడియెన్స్ ఎగబడతారు. కరోనా క్రైసిస్ లో సినిమా షూటింగులన్నీ ఆపేయగా వర్మ మాత్రం తనని ఆపడం ఎవరి వల్లా కాదు అన్నట్టుగా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. 

 

ఈమధ్యనే మియా మాల్కోవాతో చేసిన క్లైమాక్స్ రిలీజ్ చేసిన ఆర్జీవీసినిమా రిలీజైన మరుసటి రోజే మరో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. క్లైమాక్స్ సినిమా రిలీజ్ చేసిన తరహాలోనే ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్ ఈటి ఏటిటి ద్వారానే వర్మ నెక్స్ట్ సినిమా కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. నగ్నం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మళ్ళీ  వర్మ. కెమెరా యాంగిల్స్ ఎక్కడెక్కడ పెట్టాలో తెలిసిన వర్మ తన టేకింగ్ టోన్ సగం మార్కులు కొట్టేస్తున్నాడు. 

 

నగ్నం ట్రైలర్ లో చూపించేది బూతు అయినా ఎంతో నీట్ గా.. చాలా అందంగా ట్రైలర్ కట్ చేశాడు ఆర్జీవీ. ఇలాంటి విషయాల్లో ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అనిపించేలా మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. నగ్నం సినిమా కూడా త్వరలోనే ఏటిటి లో రిలీజ్ చేస్తాడట. ఈ సినిమాకు 200 రూపాయల ప్రయిజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కరోనా వల్ల లాక్ డౌన్ తో అన్ని షూటింగ్స్ ఆగిపోగా తన స్టఫ్ మొత్తం బయటకు తీసి సత్తా చాటుతున్నాడు ఆర్జీవీ. సినిమా ఫలితాలు ఎలా ఉన్న సరే ఈ టైం లో ఆడియెన్స్ ను ఏదో ఒకవిధంగా ఎంటర్టైన్ చేస్తున్న ఆర్జీవిని చాలామంది పొగుడుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: