దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా బాలకృష్ణ తన తండ్రికి ఉన్న నటరత్న బిరుదుని సార్థకం చేస్తూ యువరత్న గా ఎదిగారు. తండ్రి తన తరంలో ఎలా స్టార్ హీరోగా తెలుగు సినిమా రంగాన్ని శాసించారో అలాగే బాలయ్య సైతం తన తరం హీరోలలో స్టార్ హీరో అయ్యాడు. తండ్రి న‌ట‌ర‌త్న అయితే బాలయ్య యువ‌రత్న, సీమ సింహం,  బాక్సాఫీస్ లాంటి బిరుదులు సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే 105 సినిమాలు చేసిన బాలయ్య ఏనాడు కూడా ఎవరితోనూ అకారణంగా గొడవలు పడలేదు. తనకు తోచినప్పుడూ కూడా పొరుగువారికి సాయపడుతూ తండ్రి నుంచి వచ్చిన లక్షణాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాడు.

 

సినిమా రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ హీరో ల మధ్య పోటీలు, ఎత్తులు పై ఎత్తులు.. కుళ్లు కుతంత్రాలు.. మా సినిమా మాత్రమే ఆడాలన్న ఆడాలని హీరోలకు ఉండే స్వార్థబుద్ధి చాలా సహజంగా ఉంటుంది. అయితే బాలయ్య వీటన్నింటికీ దూరంలో ఉంటారు. వాస్తవంగా చూడాలంటే బాలయ్య కెరీర్ లో హిట్లు కంటే ప్లాపులే ఎక్కువ వచ్చాయి. ఆయినా బాలయ్య వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ఏనాడు కూడా ఒకరిని అకారణంగా మాట అనేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు.

 

ఇక కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న నందమూరి ఫ్యామిలీ ఎంతో అదృష్టం చేసుకుందని... ఇందుకు కారణమైన అభిమానులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెబుతూ ఉంటారు. గతంలో వరదలు వచ్చిన సమయంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి విరాళం అందించిన బాలయ్య.. ఏనాడు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకోలేదు. ఇక అభిమానులకు ఇబ్బందిక‌ర‌ పరిస్థితులు వచ్చినప్పుడు బాలయ్య తాను చేసిన సాయాన్ని ఎప్పుడు ప్రకటించు కోరు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల మందికి ఆయన చేసిన సేవల గురించి చిన్న ముక్క కూడా చెప్పుకోరు. అది బాలయ్య  విల‌క్ష‌ణ శైలిగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: