విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారక రామారావు వారసుడి గా వెండితెర అరంగేట్రం చేసిన నటుడు నందమూరి బాలకృష్ణ. తండ్రి అడుగుజాడ ల్లోనే హీరో గా వెండితెర కు పరిచయం అయినా బాలయ్య తండ్రి బాట లోనే ఎన్నో ప్రయోగాలు చేశాడు. సాంఘిక చిత్రాల్లో హీరో గా పరిచయం అయినా తరువాత జానపద, పౌరాణిక చిత్రాలతో కూడా మెప్పించాడు.

 

ముఖ్యంగా ఎన్టీఆర్‌ ను ప్రేక్షకుల గుండెల్లో భగవంతుడి గా ముద్ర వేసిన శ్రీకృష్ణుడి పాత్రలో నటించి తండ్రి కి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడి గా ఎన్నో ప్రయోగాలు  చేసిన బాలయ్య, తండ్రి బాటలో దర్శకత్వం వైపు కూడా అడుగులు వేశాడు. ఎన్టీఆర్ హీరో గా ఎంతో బిజీ గా ఉన్న సమయంలోనే దాన వీర శూర కర్ణ లాంటి భారీ చిత్రాన్ని స్యయంగా నిర్మించి నటించి దర్శకత్వం వహించాడు.

 

తండ్రి ఇన్సిపిరేషన్ ‌తో ఓ పౌరాణిక చిత్రంతో దర్శకుడిగా మారాలని భావించాడు బాలయ్య. అందుకోసం తండ్రి రూపొందించిన నర్తనశాల కథ నే ఎంచుకున్నాడు. పౌరాణిక గాథతో దర్శకుడిగా పరిచయం అవుతూ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా కోసం వైజాగ్‌లో ప్రత్యేకం గా స్టూడియో నిర్మాణం కూడా చేశాడు. అయితే ఎన్నో ఆశలతో భారీగా ప్రారంభమైన ఈ సినిమా తొలి అడుగు దగ్గరే ఆగిపోయింది.

 

నర్తనశాల సినిమాలో ద్రౌపది పాత్రకు అప్పటి టాప్‌ స్టార్‌ సౌందర్యను తీసుకున్నాడు బాలయ్య. సినిమా ప్రారంభం అయిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటంతో నర్తనశాల ఆగిపోయింది. తరువాత ద్రౌపది పాత్రకు మరో హీరోయిన్‌ దొరక్కపోవటంతో బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: