తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. జానపదం.. పౌరాణికం.. యాక్షన్‌.. లవ్‌.. సోషియో ఫాంటసీ ఇలా జోనర్‌ ఏదైనా సరే ఆ కథలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అగ్ర‘కథానాయకుడు’ నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో ‘బాలయ్య’గా, ‘యువరత్న’గా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ. 

 

 

నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమైన చిత్రం ‘తాతమ్మ కల’. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1974లో ఇది విడుదలైంది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆషా’ సినిమాని ఆధారంగా చేసుకుని ‘అనురాగ దేవత’ను రూపొందించారు. 1982లో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటించారు. 

 

సాహసమే జీవితం’ అనే చిత్రంతో బాలయ్య సోలో హీరోగా మారారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఖయామత్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘నిప్పులాంటి మనిషి’ రూపొందింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన యాక్షన్‌ కథాచిత్రం ‘దొంగ రాముడు’. 1988లో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. ‘నారీ నారీ నడుమ మురారి’. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్దే కాకుండా బాలయ్య కెరీర్‌లో కూడా సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది.

 

 

బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బంగారు బుల్లోడు’ 1993లో విడుదలైంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. సమరసింహారెడ్డి’, ‘సుల్తాన్‌’  ‘సీమసింహం  మిత్రుడు చిత్రాల తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం ‘క్రిష్ణబాబు’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాఅభిమానులను అలరించింది.

 

 

శాతవాహనుల రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఓ అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. శ్రియ, హేమమాలిని నటన ప్రత్యేకార్షణగా నిలిచింది. 2017లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: