వారసత్వం నుండే నటనను ఉనికిపుచ్చుకున్న హీరో. ఈ పాత్రకైనా శత శాతం న్యాయం చేయగాల యొద్యుడు. రికార్డుల విషయంలోనే కాదు.. ఈయన షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారు బాలయ్య. తాతమ్మ కల సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ...‘సాహసమే జీవితం’ చిత్రంతో సోలో హీరోగా కెరీర్ ప్రారంభించారు.

 

 

ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసి నిర్మించిన ‘‘సమ్రాట్ అశోక’’ చిత్రంలో బాలకృష్ణ ఒక రోల్ చేయాల్సి ఉండే. ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ పాత్ర మోహన్ బాబు చేసారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రోజా, పూజాభాత్ర హీరోయిన్లుగా విక్రమ సింహా భూపతి’ అనే  జాపపద సినిమాను స్టార్ట్ చేశారు. దాదాపు ఎనభై శాతం షూటింగ్ కంప్లీటైన ఈమూవీ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో .. ఆయన కొడుకు భార్గవ్ బ్యాడ్ సెంటిమెంట్‌గా భావించి ఈ సినిమాను వద్దని చెప్పారు.

 

 

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన స్వీయ దర్శకత్వంలో సౌందర్యను ద్రౌపదిగా తీసుకొని... నర్తనశాల సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య అకాలంగా మరణించారు. దింతో ఆ పాత్ర చేసే హీరోయినే దొరకలేదనే కారణంతో బాలయ్య ‘నర్తనశాల’ సినిమాకు ప్యాకప్ చెప్పేసారు. బి.గోపాల్ దర్శకత్వంలో కొబ్బరికాయ కొట్టిన ‘హరహర మహదేవ’ సినిమా కూడా ఈ రకంగానే స్టోరీ నచ్చక పక్కన పెట్టేసారు బాలయ్య. 

 

 

కే.రాఘవేంద్రరావు తనయుడు కే ప్రకాష్ రావు దర్శకత్వంలో శ్రీకాంత్‌తో కలిసి ‘భట్టి విక్రమార్క’ సినిమాను అనౌన్స్ చేసాడు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ సినిమాను కూడా చేద్దామని ప్రకటించిన ఇంత వరకు పట్టాలెక్కలేదు. మొత్తానికి బాలయ్య ఆయన మధ్యలో ఆపేసిన సినిమాల విషయంల కూడా ఒక రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: