నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 60వ ఏట అడుగు పెట్టగా... అతను సినీ పరిశ్రమలో నెలకొల్పిన రికార్డులు గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 1984వ సంవత్సర ప్రథమార్ధంలో విడుదలైన మంగమ్మ గారి మనవడు సినిమా హిట్ అవ్వడంతో బాలకృష్ణ కు ఎన్నో సినీ అవకాశాలు దన్నుకొచ్చాయి. దాంతో అదే సంవత్సరంలో ఏకంగా ఆరు సినిమాల్లో బాలకృష్ణ హీరోగా, ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. తదుపరి సంవత్సరంలో అనగా 1985లో ఆరు సినిమాల్లో హీరోగా నటించి తనలో ఎంత పట్టుదల, కృషి ఉందో చెప్పకనే చెప్పారు. 1985 లో విడుదలైన బాబాయి అబ్బాయి చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


1986 సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలు ఐన నిప్పులాంటి మనిషి(1986), ముద్దుల కృష్ణయ్య(1896) లలో హీరోగా నటించగా... వాటిలో ఆరు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఆరు హిట్స్ సాధించిన ఏకైక హీరోగా బాలకృష్ణ చరిత్ర తిరగరాశాడు. ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో ఆరు హిట్లు సాధించిన హీరో ఎవరూ లేరు. బాలయ్య నెలకొల్పిన ఈ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. 


కాలక్రమేణా బాలకృష్ణ కు ఎటువంటి కథని ఎంచుకోవాలో ఎటువంటి కథను రిజెక్ట్ చేయాలో తెలియడంతో ఎన్టీరామారావు అతడి సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడం ఆపారు. 1987వ సంవత్సరంలో ఏడు చిత్రాల్లో నటించే 5 హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరంలో 6 సినిమాల్లో నటించి నాలుగు సినిమాలు హిట్ కొట్టాడు. 1989 లో నాలుగు సినిమాల్లో నటించి 3 సినిమాల్లో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 1999-2005 వరకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, విజయేంద్ర వర్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాడు బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: