సాధారణంగా నిజ జీవితంలో ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తన కూతుళ్ళను, కొడుకులను పట్టించుకునే అవకాశం ఉండదు... వాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే చూస్తూ ఉంటారు గాని పెద్దగా వారి విషయంలో మాత్రం తమ పెత్తనం ఉండాలి అనేది ఎక్కడా ఉండే అవకాశం ఉండదు. అయితే కొన్ని కొన్ని సలహాలు చేయడమే గాని వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం చాలా మంది చేయరు అని అంటారు. అది రాజకీయాలు అయినా సినిమాలు అయినా సరే మరొకటి అయినా సరే  ఇదే విధంగా ఉంటుంది. వాళ్లకు సమయం ఉండదు కాబట్టి పట్టించుకునే అవకాశం ఉండదు. 

 

అయితే టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ విషయంలో మాత్రం ఆ విధంగా ఉండదు అని అంటారు సినీ జనాలు. ఆయన ఎంత బిజీ గా ఉన్నా సరే సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్నా సరే తన పిల్లల విషయంలో ఆయన ప్రతీ విషయాన్ని పట్టించుకుంటూ ఉంటారు అని, పిల్లల చదువుల నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆయన అన్నీ కూడా ఆరా తీస్తారు అని అంటారు. ఆయనే ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ చూపిస్తారు అని అంటారు. పిల్లలు విద్యా వంతులు కావాలి అనేది ఆయన కల అని అందుకే వాళ్ళను అన్ని విధాలుగా కూడా విద్యలో ముందుకి నడిపించారు అని అంటారు. 

 

టాలీవుడ్ లో ఏ హీరో కూడా పిల్లల విషయంలో ఈ స్థాయిలో కేర్ తీసుకున్న సందర్భం లేదు అని అంటారు. ఎక్కువగా భార్యల మీద భారం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అని కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అవి అన్నీ సరదాగా  వచ్చే వ్యాఖ్యలే గాని బాలకృష్ణ విషయంలో మాత్రం అలా ఉండదు అని అంటారు. ఆయన అన్నీ ఆలోచిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: