మన తెలుగులో చాలా మంది హీరోలు స్టార్ హీరోయిన్ లతో సినిమాలు చెయ్యాలి అని భావిస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అయితే తమ సినిమాలకు ఒక మంచి గుర్తింపు వస్తుంది అనే భావన లో వాళ్ళు ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో బాలకృష్ణ విషయానికి వస్తే మాత్రం ఆయన ఆలోచన ఆ విధంగా ఉండదు అని కొత్త హీరోయిన్ కి అవకాశం ఇవ్వాలి అని ఆయన భావిస్తారు అని అంటారు జనాలు. 

 

ఆయన అందుకే తన సినిమాల్లో యువ హీరోయిన్ లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తారు అని చెప్తూ ఉంటారు. ఈ విషయంలో ఆయన ఎవరు చెప్పినా సరే వెనకడుగు వేసే అవకాశం ఉండదు అని అంటారు. చిన్న చిన్న చిన్న హీరోలు పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు అలా ఆలోచిస్తుంటే సీనియర్ హీరో అయిన బాలయ్య మాత్రం  కొత్త హీరోయిన్ లకు ప్రాధాన్యత ఇస్తారు అని అవకాశాలు లేని వారికి అండగా నిలబడుతూ ఉంటారు అని అంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఆ విధంగా సినిమాలు చేయడం లేదు. 

 

ఇక హీరోయిన్ తో కూడా ఆయన చాలా  హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే వ్యాఖ్యలు కూడా మనం వింటూనే ఉంటాం. హీరోయిన్ గురించి అన్నీ కూడా ఆయన ఒక పెద్ద తరహాలో అడిగి తెలుసుకుంటూ ఉంటారట. ఏ విధంగా అయినా సరే వాళ్లకు ఆయన నుంచి  సహకారం ఉంటుంది అని సెట్స్  లో కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా బాలయ్య చూస్తారు అని అంటారు. ఇక క్రమ శిక్షణ విషయంలో కూడా బాలయ్య అదే విధంగా ఉంటారు అని అంటారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: