నేటితో నందమూరి నటసింహం బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కు సినిమా ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా బాలయ్యకు విషెస్ తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నానని చిరు ట్వీట్ చేశారు. 
ఇక నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ..జై బాలయ్య  అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తన 106వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా నుండి నిన్న విడుదలైన టీజర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఈఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: