సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకునేందుకు అభిమానులు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా వారిగతం చిన్నతనం గురించి తరుచూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్ చేసే స్వీట్ మెమోరీస్‌ వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ అందాల భామ షేర్ చేసిన అలాంటి మెమోరీ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

 

ఈ రోజు తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ త్రో బ్యాక్‌ ఫోటోనే షేర్ చేసింది అందాల భామ దీపికా పదుకొనే. తన తండ్రి 65 పుట్టిన రోజు నేపథ్యంలో తాను తండ్రి ఒల్లో కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ `నా దగ్గర ఉన్న గొప్ప ఆఫ్‌ స్క్రీన్‌ హీరో. మమ్మల్ని ఫ్రొఫెషనల్‌గా, మంచి వ్యక్తులుగా తీర్చిద్దిన మీకు కృతజ్ఞతలు` అంటూ కామెంట్ చేసింది దీపికా పదుకొనే.

 

ఇక సినిమాల విషయానికి వస్తే లాక్ డౌన్‌కు ముందు బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన చప్పాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత భర్త రణవీర్‌ సింగ్‌తో కలిసి నటించిన 83 సినిమా నిర్మాణ దశలో ఉండగా లాక్‌ డౌన్‌ రావటంతో ఆ సినిమా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. లాక్‌ డౌన్‌ సమయంలో కథ వింటూ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తోంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: