తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది ఇలియానా. ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు అందరి తో కూడా దాదాపుగా ఆమెకు హిట్స్ వచ్చాయి. అయితే అనూహ్యంగా అకేరీ ర్లో ఆమె  బాగా ఇబ్బంది పడుతూ వస్తుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయినా సరే ఇప్పుడు మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు వచ్చే పరిస్థితి టాలీవుడ్ లో కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె సినిమాలు చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త వచ్చింది. ఆమె సొంతగా ఒక వెబ్ సీరీస్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఆమె ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టింది అని సమాచారం. త్వరలోనే ఆమె దీనిని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వెబ్ సీరీస్ కి ఆమెకు పరుచూరి బ్రదర్స్ కథ ఇచ్చారు అని సమాచారం. త్రివిక్రమ్ ద్వారా ఆమె ఈ కథ తీసుకుంది అని టాలీవుడ్ లో జనాల టాక్. 

 

మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమె మాత్రం ఇప్పుడు అవకాశాల కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది అనేది మాత్రం వాస్తవం. ఇక ఇప్పుడు ఆమెకు చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వచ్చే అవకాశాలు కనపడటం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి భవిష్యత్తులో ఆమె ఏ సినిమాల్లో నటిస్తుంది అనేది చూడాలి. పవన్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: