నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే.  బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ తర్వాత హీరోగా మారి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ లాగే సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎలాంటి పాత్రకైనా వన్నె తెచ్చిన ఘనత ఆయనది.  నేడు బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.

IHG

'ఎనర్జీకి బాలకృష్ణ  పవర్ హౌస్‌లాంటి వారు.  ఆయన నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన జీవితాంతం ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. కాగా, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు నటసింహం బాలకృష్ణ. ఇండియాహెరాల్డ్.కామ్ తరుపు నుంచి నందమూరి బాలకృష్ణ గారికి శుభాాకాంక్షలు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: