మన తెలుగులో అరవింద్ స్వామికి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. అరవింద్ స్వామిని విలన్ గా తీసుకోవడానికి గానూ స్టార్ హీరోలు న్దరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధ్రువ సినిమా తర్వాత ఆయన క్రేజ్ బాగా పెరుగుతూ వచ్చింది. ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అప్పటి నుంచి అభిమానులు కూడా ఏర్పడ్డారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన మన తెలుగులో సినిమాలు ఏమీ చేయడం లేదు. హింది లో ఒక సినిమా చేస్తున్నారు ఇక తమిళంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

అక్కడ ఆయన ఇప్పుడు టాప్ విలన్ గా ఉన్నారు. అక్కడి అగ్ర దర్శకులకు ఆయన మంచి ఆప్షన్ అనేది మన వాళ్ళ మాట. ఆయన టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా సరే వరుసగా పోగొట్టుకుంటున్నారు అని టాక్ ఎక్కువగా వినపడుతున్నారు. దానికి కారణం ఆయన భారీగా డిమాండ్ చేయడమే అనేది చాలా మంది మాట. అగ్ర హీరోలతో అవకాశాలు వచ్చినా సరే ఆయన భారీగా డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనితో ఆయనను నిర్మాతలు పక్కన పెడుతున్నారు అని సమాచారం. 

 

అగ్ర హీరోలు కూడా ఆయన తో సినిమా చేయడానికి ఇందుకే ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది అని సమాచారం. ఇటీవల ప్రభాస్ ఆయనను చూసి భయపడి సినిమాను చేయను అని చెప్పాడు అని అంటున్నారు. అదే విధంగా రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా అయన విలన్ అయితే వద్దు అని చెప్పారు అని అంటున్నారు. అదే విధంగా అగ్ర హీరోలు మరి కొందరు అయితే ఆయన పేరు వింటే చాలు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. దీనికి కారణం ఆయన వ్యవహార శైలే అని సమాచారం. మరి ఆయన ఏ సినిమా ల్లో చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: