మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆయనకు బాగా కలిసొచ్చిన బ్యానర్స్ లో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ ఒకటి. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాతగా చిరంజీవితో ఆ బ్యానర్లో 8 సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో బిగ్ బాస్ మినహా అన్ని సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి. ఈ సినిమాలన్నింటికీ విజయబాపినీడే దర్శకత్వం వహించారు. అప్పట్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఖైదీ నెం.786. ఈ సినిమా విడుదలై నేటితో 32 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

సినిమా 1988 జూన్ 10న విడుదలై సంచలన విజయం సాధించింది. సినిమా పూర్తిగా కుటుంబ కథా సినిమాగా తెరకెక్కింది. ఇందులో చిరంజీవి తరహా మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చిన్నప్పుడే మేనమామ కుట్రకు బలైపోయి అనాధలా మరొకరి వద్ద పెరిగిన యువకుడి పాత్రలో చిరంజీవి నటించారు. హీరోయిన్ గా భానుప్రియ నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఇది సూపర్ హిట్ అని చెప్పాలి. క్యారెక్టర్లు పరంగా వీరద్దరూ సినిమాలో పోటీపడి నటించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు విలన్ పాత్రలో నటించారు.

IHG

 

సంగీతం పరంగా సినిమా చార్ట్ బస్టర్ అని చెప్పాలి. యముడికి మొగుడు తర్వాత చిరంజీవికి రాజ్-కోటి అందించిన ఈ పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా ‘గువ్వా.. గోరింక’ పాట అప్పట్లో మోగిపోయింది. అప్పటికే చిరంజీవితో వరుస హిట్లు ఉన్న విజయబాపినీడు ఈ సినిమాకు ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచిపోయిన ఈ సినిమా 24 కేంద్రాల్లో డైరక్ట్ గా 100 రోజులు ఆడింది. ఈ ముగ్గురి కాంబినేషన్ వాల్యూని మరోస్ధాయికెక్కించింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: