టాలీవుడ్ లో మన వాళ్ళ కంటే బయటి భాషలకు ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. బయటి భాషలకు ఎక్కువగా మన తెలుగులో ప్రాధాన్యత ఇవ్వడమే కాదు వారిని సినిమాల్లోకి తీసుకోవడానికి గానూ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారినే తీసుకునే ఆలోచనలో ఉంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు అయిన చిన్న హీరోల సినిమాలు అయినా ఏ హీరోల సినిమాలు అయినా సరే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు జనాలు. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. 

 

అయినా సరే మన వాళ్ళు పెద్దగా వెనక్కు తగ్గే సాహసం మాత్రం చేయడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కువగా మన వాళ్ళు విజయ్ సేతుపతి వెంట పడుతున్నారు అని తెలుస్తుంది. మహేష్ బాబు తన సినిమాలో విజయ్ సేతుపతి కావాలి అని అడిగాడు అని అలాగే ఎన్టీఆర్ కూడా అదే విధంగా విజయ్ సేతుపతి మీద ఆసక్తి చూపిస్తున్నాడు అని అతని కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది అని అందుకే అతని విషయంలో ఇప్పుడు మన హీరోలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి.

 

చిన్న చిన్న హీరోలు కూడా అదే విధంగా ఆలోచించడం కాస్త తల నొప్పిగా ఉందని టాలీవుడ్ లో అంటున్నారు. అతను విలన్ అయితే తమిళ మార్కెట్ ని భారీగా పెంచుకోవచ్చు అనే భావన లో ఉన్నారట. మరి అతను చేస్తాడా లేదా తెలుగు సినిమాలు అనేది చూడాలి. ఇప్పటికే కొన్ని కొన్ని సినిమాలను అతను ఓకే చేసాడు. పుష్ప సినిమాలో ఓకే చేసినట్టే చేసి అతను వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. మరి ఇంకా ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: