ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలు అందరూ కూడా దాదాపుగా 80 ఏళ్ళకు పైబడిన వారే కావడం గమనార్హం. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఇలా నలుగురు హీరోలు కూడా  60 ఏళ్ళకు మించి ఉన్న వారే కావడం విశేషం. అగ్ర హీరోలు అందరూ కూడా ఈ విధంగా ఉండటంతో ఇప్పుడు వారి సినిమాలకు ఆదరణ ఉంటుందా లేదా అనే అనుమానాలు టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వారి సినిమాలను జనాలు చూసే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చలు అనేకం జరుగుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలను ఇప్పుడు ఆదరించాలి అంటే వారు యాక్టివ్ గా ఉండాలి. 

 

లేదా భిన్నమైన కథలతో సినిమాలు చెయ్యాలి. అందుకే ఇప్పుడు మన తెలుగులో నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ చిరంజీవి వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడుతున్నారు అని అంటున్నారు. బాలకృష్ణ అయితే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారు అని సమాచారం. అదే విధంగా మరి కొందరు స్టార్ హీరోలు కూడా వ్యాయామం మీద దృష్టి పెట్టారు అనే విషయం స్పష్టంగా చెప్పవచు. చిరంజీవి అయితే ప్రత్యేక వైద్యుడి సమక్షంలో ఎక్కువగా ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. 

 

వెంకటేష్ కూడా ఇప్పుడు అదే విధంగా సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఆరోగ్యం మీద చాలా వరకు దృష్టి పెడతారు అని ఆయనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని ఇప్పుడు వాటి నుంచి ఆయన బయటకు రావడానికి  తీవ్రంగా కష్టపడుతున్నారు అని అంటున్నారు. ఇక ఇతర యువ హీరోలు కూడా ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నారు. వయసు మీద పడినా సరే ఏ సమస్యలు రాకుండా ఉండటానికి వాళ్ళు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: