సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజుల ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు.  దీనితో ద్వారా పనుల్లో మరో కోణాన్ని  అభిమానులకు పరిచయం చేసింది మంజుల. యూట్యూబ్ ఛానల్ లో మొదటి వీడియోగా.. జీవితంలో అనుభవించిన మానసిక వేదన గురించి... డిప్రెషన్ తో పోరాడిన విషయాల గురించి . ఆ వీడియో ఐదు నిమిషాలు ఉండగా మంజుల తన పది సంవత్సరాల పాటు మానసిక ఒత్తిడిని ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కించే పూర్తిగా వివరించడం జరిగింది.

 

 

ఈ సమస్యలన్నిటినీ ఆరోగ్యకరమైన జీవనశైలి సుదీర్ఘ ధ్యానం ద్వారానే అధిగమించానని మంజుల తెలియజేశారు.  ఇక అలాగే గొప్ప యాక్టర్ అవ్వాలని చాలా కలలు కన్నాను అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు కూడా అది ఫలించలేదు. దీనికి నేను చాలా బాధపడ్డాను. అంతే కాకుండా దాని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ ఒత్తిడి నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపింది. అప్పటి నుంచి నాకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళి పోయాను అంటూ తెలియజేసింది.  

 


అంతేకాకుండా ఈ కమర్షియల్ సినిమాలకు కరెక్ట్ కాదు అని నాకు అర్థం అయింది... నిజమైన సంతోషం మనలోనే ఉంది అంటూ మంజుల పేర్కొంది. ఇక అప్పటి నుంచి ప్రతి క్షణం ప్రేమలో ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ తెలియజేసింది. ఈ అద్భుతమైన అనుభవం నా జీవితాన్ని మొత్తం పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో షో సినిమా ద్వారా మళ్ళి నా యాక్టింగ్ కలను నిజం చేసుకోవాలనుకుంటున్నాను. నేనే మారడంతో పాటు ప్రశాంత వాతావరణం కూడా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే నాన్నతో, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. అలాగే ఇక ఇప్పటి నుంచి తన యూట్యూబ్ ఛానల్ లో తన విషయాల గురించి మంజుల తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: