నటీనటులకు రోటీన్ పాత్రలకు భిన్నంగా కొత్తదనం ఉన్న పాత్రలు వస్తే వారిలోని నటన బయటకొస్తుంది. అయితే ఆయా పాత్రల్లో నటించడానికి కొందరు సాహసించ లేరు. మరికొందరు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ‘జరీన్ ఖాన్’. ఆమె నటించిన ‘హమ్ బీ అఖేలే తుమ్ బీ అఖేలే’ ఈ కోవలోకే వస్తుంది. ఇందులో జరీన్ ఖాన్ లెస్బియన్ పాత్ర చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో హాట్ టాపిక్. జరీన్ తెలుగులో గోపీచంద్ తో ‘చాణక్య’లో నటించింది.

IHG

 

తన పాత్రపై జరీన్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక గే, ఒక లెస్బియన్ కథ. వీరిద్దరూ కలిసి చేసే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లే ఈ కథ. వీర్ పాత్రలో హీరో అన్షుమన్ ఝా, మాన్సీ పాత్రలో నేనూ నటిస్తున్నాం. ఇండియాకు వ్యతిరేకమైన హోమో సెక్సువాలిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సినిమా అంతా ఢిల్లీ, నొయిడా, ధర్మశాలలోనే తెరకెక్కింది. ఈ పాత్ర నాకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర ఛాలెంజింగ్ గా ఉండి నా మనసుకు దగ్గరైంది’ అని చెప్పుకొచ్చింది జరీన్. హోమో సెక్సువాలిటీని ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఫన్నీగా తెరకెక్కించామని దర్శకుడు హరీశ్ వ్యాస్ అంటున్నాడు.

IHG

 

గతేడాది న్యూయార్క్ లో జరిగిన సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఈ సినిమా. రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్, బెస్ట్ హీరోయిన్ అవార్డులు కూడా గెలుచుకుంది ఈ మూవీ. ఈ మార్చిలో ధియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: