త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ సినిమా షూటింగ్స్ తో సందడి మొదలవబోతోంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్స్ కి అనుమతులు ఇచ్చింది. దాంతో నిర్మాతలు మళ్ళీ షూటింగ్స్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. హీరో హీరోయిన్స్ ..ఇతర నటీ నటుల డేట్స్ ని తీసుకుంటున్నారు. అతి కొద్ది మంది యూనిట్ తో ఎక్కువ శాతం ఇన్ హౌజ్, అలాగే స్టూడియోలలో మాత్రమే చిత్రీకరణ జరిపేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్స్ వేసి ఉంచారట. ఆచార్య, ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్ సినిమా, పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ...ఇలా చాలా సినిమాలు అక్కడే షూటింగ్ జరగనున్నాయట. 

 

అయితే కొత్తగా సినిమాలు నిర్మించాలంటే మాత్రం ఈ ఏడాది వచ్చే ఏడాది ప్లాన్ చేసుకుంటున్నారట. అంతేకాదు మీడియం బడ్జెట్ సినిమాలైనా ఈ ప్రకారమే సన్నాహాలు చేసుకోవచ్చు. అది కూడా పక్కా ప్రణాళిక సాధ్యమైనంత వరకు బడ్జెట్ కంట్రోల్ లో ప్లాన్స్ చేసుకొని నిర్మించాలి. ఇంతకముందు లాగా పది లక్షలు పోయినా మళ్ళీ అంతకంత రాబట్టుకోవచ్చన్న ధీమా నిర్మాతలలో ఉండేది. కాబట్టి ఇష్టానుసారంగా ఖర్చు చేసేవాళ్ళు. ఇప్పుడలా కాదు.

 

ఇక భారీ బడ్జెట్ సినిమాలైతే ఇప్పుడు ప్లాన్ చేయకపోవడమే నిర్మాతలకి ఎంతో మంచిది. ఒక వేళ ప్లాన్ చేసుకున్న అవి 2022 లోనే సెట్స్ మీదకి వెళ్ళేలా ప్రణాళికలు వేసుకుంటే భారీ ప్రాజెక్ట్స్ లో భారీ నష్టాలు జరగవు. అప్పటి వరకు అన్ని పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థాయికి వస్తాయి. లేదంటే ఏ నిర్మాతైనా నిండా మునగాల్సిందే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్, రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళ కాంబినేషన్ లో రాబోయో భారీ బడ్జెట్ సినిమాలు చూస్తూంటే 2022 నే అని అనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: