దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'రౌద్రం రణం రుధిరం'. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిక్షన్ కథతో హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిస్తున్నారు రాజమౌళి. రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటి అలియా భట్, ఎన్టీఆర్ కి జంటగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తుండగా ఆయన సరసన శ్రియా శరణ్ నటిస్తున్నట్టు ఇటీవలే వెల్లడయింది.   

 

IHG

రాజమౌళి తండ్రి విజయోంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం ..కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలివియా మోరిస్ మధ్య ఒక అద్భుతమైన సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ సినిమాలో చాలా హైలెట్ అవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అంతేకాదు తారక్ పక్కన ఈ బ్రిటీష్ బ్యూటిని చూడటానికి రెండు కళ్ళు చాలవని అంటున్నారు. చెప్పాలంటే బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ ని కొన్ని సీన్స్ లో డామినేట్ చేసేలా ఉంటుందట. 

 

IHG's Benarsi Sari During Kalank Promotions | VOGUE India

ఇక ఈ సినిమాలో 920ల నాటి వెస్ట్రన్ అండ్ ఇండియన్ స్టైల్ లో తారక్ ఓలివియా సాంగ్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కొరియోగ్రఫీ హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేయనున్నారట. రాజమౌళి సినిమాలలో సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లోను అంతకు మించి చరణ్ ఆలియా ... తారక్ ఓలివియా ల సాంగ్స్ ఉండనున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా జనవరి 8, 2021 న రిలీజ్ చేయాలనుకున్నప్పటికి మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: