నందమూరి బాలకృష్ణ తన 60 పుట్టిన రోజు అభిమానులు తమ సోషల్ మీడియా తరుపున ఓ పండగలా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ...ఓ వీడియొ ని రిలీజ్ చేశారు..అందులో  ...అందరికీ నమస్కారం. కొందరి జీవితాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి అదేవిధంగా నా జీవితంలో ఈ 60వ పుట్టినరోజు అనగా   షష్టి పూర్తి రోజున నా అభిమానులు నాపై ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు అభిమానులు మరియు నందమూరి అభిమానులు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది.

 

 

ఇటువంటి గుర్తుండిపోయే పుట్టినరోజు పండుగను బాహాటంగా చేసుకోవాలని ఆశగా ఉన్నా కరోనా మహమ్మారి నేపథ్యంలో నేనే నా అభిమానులందరినీ ఎటువంటి వేడుకలు మరియు హడావిడి చేయవద్దని సూచించడం జరిగింది. మీ అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు జరుపుకోలేక పోయినందుకు చాలా బాధగా ఉంది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో ఈ మహమ్మారి లేని సమయంలో సినిమా ఫంక్షన్లకు, నాన్న గారి వేడుకలకు అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించేవారు అయితే  ఈ  కరోనా మహమ్మారి   వల్ల చాలా అసంతృప్తిగా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా మధ్య మాల్లో నా ఫోటో లు పెడుతూ ట్యాగ్ లైన్ లు పెడుతూ పోస్ట్లు చేసి వారి అభిమానాన్ని చూపించారు. అదేవిధంగా దాదాపు వందమంది సినీ ప్రముఖులు నాకు  వారి సోషల్ మీడియా ఖాతాల నుండి విషెస్ తెలిపారు.

 

 

 ఈ సందర్భంగా ఆయన చెబుతూ... చరిత్ర సృష్టించాలన్న మనమే.. దానిని తిరగరాయాలి అన్నా మనమే అనే డైలాగ్ ని చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా 12 వేల కిలోల కేకు ని కట్ చేసి రికార్డ్ ని సృష్టించారు. ఈ సందర్భంగా అభిమానులు చాలా కష్టపడుతున్నారు వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి సమయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది... ఎందుకు?... నాకు  మీకు మధ్య అవినాభావ సంబంధం ఏమిటి...?.. అని అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్ననందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు అన్ని కులాలు, మతాలు... కలసినటువంటి సంగమం.

 

 

నేను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదిస్తున్న అభిమాన జననాంగానికి కృతజ్ఞతలు. ప్రతి ప్రయత్నానికి వెన్నుతట్టి ముందుకు నడుపుతున్న అభిమానులందరికీ కృతజ్ఞుడను. నేను  అనుకోని వారు కూడా నాకు విషెస్ తెలపడం చాలా సంతోషంగా ఉంది వారందరికి నా కృతజ్ఞతలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల అందరికీ నా అభివాదములు.  ఇక ట్రైలర్ గురించి మాట్లాడాల్సి వస్తే.... బోయపాటి మరియు నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ట్రైలర్ లో నేను ప్రదర్శించినటువంటి  రౌద్రం,   కోపా వేషం అవి మనకు వెన్నతో పెట్టిన విద్య.

 

 

 ఈ సందర్భంగా పాడిన శివశంకరీ పాట పాడటానికి ఆదర్శం మా నాన్నగారు.ఈ  పాటను ఎప్పటి నుంచో పాడాలని నాకు అనిపిస్తూ ఉండేది. అది ఈ రోజున నెరవేరింది. ఈ పాట ను ఆధరించిన అభిమాన ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు.  ఇకపోతే బోయపాటి మరియు నా కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఇది హ్యాట్రిక్ సాధిస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా బోయపాటి మరియు బాలకృష్ణ కాంబినేషన్ అనగానే మా మధ్య వైబ్రేషన్, అండర్స్టాండ్ గుర్తుకు వస్తాయి.   ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లేక అట్టడుగు స్థాయి పనివారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సినిమా షూటింగులు ప్రారంభ  అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమా షూటింగ్  లు చేయడానికి ప్రభుత్వం నుంచి చాలా  రెస్ట్రిక్షన్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీరు చూసిన ఈ ట్రైలర్ రేంజ్ లో సినిమాని కూడా చేసి మీ ముందుకు తెస్తున్నాం. నా  పేరిట చేసిన సేవా కార్యక్రమాలు  దృష్ట్యా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: