చిరంజీవి సాధించిన అప్రతిహతమైన క్రేజ్, ఇమేజ్ కు కారణం ఆయన మాస్ క్యారెక్టర్లే. ఆయనిచ్చే మాస్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, మాస్ మేకోవర్, మ్యానరిజమ్స్ ఆయన్ని మెగాస్టార్ ని చేశాయి. మాస్ సినిమాలకు చిరంజీవిని కేరాఫ్ అడ్రస్ చేసిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అప్పటికే చిరంజీవి తనదైన మెరుపు వేగంతో నెంబర్ వన్ హీరోగా తెలుగు సినిమాను ఏలేస్తున్నారు. కానీ.. ఈ సినిమా చిరంజీవి ఇమేజ్ గురించి మరొకరు ఆలోచించే అవకాశం ఇవ్వకుండా శిఖరమంత ఎత్తులకు తీసుకెళ్లింది.

IHG

 

‘గ్యాంగ్ లీడర్’ లో ఆయన పాత్రను మలచిన తీరు అలాంటిది. సన్నని గెడ్డంతో ఫుల్ రఫ్ లుక్ లో చిరంజీవి ఓ కొత్త స్టైలే క్రియేట్ చేశారు. ‘చెయి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్పాడించేస్తాను’ అని ఆయన చెప్పిన డైలాగ్ కు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. హాఫ్ హ్యాండ్ షర్ట్ పై బటన్ తీసేయడం, కాలర్ వెనక్కు వేయడం ఈ సినిమాలో ఆయన మాస్ మ్యానరిజమ్స్ కి పరాకాష్టగా నిలిచాయి. నలుగురు ఫ్రెండ్స్ తో తిరుగుతూ గ్యాంగ్ మెయింటైన్ చేయడం.. చిన్న సెటిల్ మెంట్ చేయడం.. దౌర్జన్యాన్ని ఎదిరించడం.. వంటి సీన్లు యూత్ ని, ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

IHG

 

ఇంటర్వెల్ సీన్ లో మోచేత్తో గోడను ఒక్క దెబ్బకు బద్దలు కొట్టడం.. రౌడీ గ్యాంగ్ ను ఒక్క దెబ్బకే మట్టుబెట్టే ఫైట్ సినిమాకు మేజర్ హైలైట్స్. ‘వస్తారా.. నా తస్సారవ్వల బొడ్డు’ అని చిరంజీవి షర్ట్ వెనక్కి వేస్తూ చెప్పిన డైలాగ్ పేలిపోయింది.  సినిమాలో పాటలు.. డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడియో, విజువల్ గా ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన ‘గ్యాంగ్ లీడర్’ ఆయన కెరీర్లో మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: