టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాస్ సినిమాలని తీయడంలో దిట్ట. మాస్ సినిమాలని తనదైన శైలిలో తెరకెక్కించి, పవర్ ఫుల్ డైలాగులతో మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్, ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని ఇంకా దధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, వర్కింగ్ టైటిల్ గా ఫైటర్ అనే కొనసాగుతుంది.

 

పూరి కనెక్స్ట్ బ్యానర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం పూరి జగన్నాథ్ తెలుగులో సినిమా చేసే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఫైటర్ సినిమా ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ కలిసినప్పటి నుండి పూరి ప్లాన్స్ అన్నీ మారిపోయాయట. కరణ్ జోహార్ తో మరో రెండు సినిమాలకి కమిట్ అయ్యాడని సమాచారం.

 

ఫైటర్ కాకుండా మరో రెండు చిత్రాలని కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ లో చేయనున్నాడట. అంటే అవి పూర్తిగా బాలీవుడ్ చిత్రాలే అయి ఉంటాయని అనుకుంటున్నారు. అందువల్ల పూరి జగన్నాథ్ ఇక బాలీవుడ్ లోనే సెటిల్ అవుతాడెమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది నుండి చాలా దర్శకులు బాలీవుడ్ లో సినిమాలని తెరకెక్కించారు. కానీ ఎవ్వరూ అక్కడ సెటిల్ కాలేకపోయారు.

 

ఒక్క రామ్ గోపాల్ వర్మ మినహా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు లేరనే చెప్పాలి. ఎంత పెద్ద సూపర్ హిట్లు ఇచ్చినా మళ్ళీ ఇక్కడికే వచ్చేసారు. మరి కరణ్ జోహార్ తో రెండు సినిమాలని ఒప్పుకున్న పూరి జగన్నాథ్, వాటిని తెరకెక్కించడానికి టాలీవుడ్ హీరోలని తీసుకుంటాడా లేదా, బాలీవుడ్ హీరొలనే తీసుకుంటాడా తెలిస్తే, ఎక్కడ సెటిల్ అవుతాడనేది తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: