సాధార‌ణంగా కాస్త ఫేమ్ వచ్చిన తరువాత యాడ్‌లలో సినీ తార‌లు నటించ‌డం స‌హ‌జ‌మే. ఇలా అవ‌కాశాలు ద‌క్కినా కాద‌నుకున్న వారు మాత్రం బ‌హు త‌క్కువ‌గా ఉంటార‌నే చెప్పాలి. ఆ అతికొద్దిమందిలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఒక‌రనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటుంటారు. తాను పెట్టుకున్న నిబంధ‌న‌ల‌ను ఎప్పుడూ బాల‌కృష్ణ త‌ప్ప‌క‌పోవ‌డం గ‌మనార్హం.కెరీర్ మొద‌లైన నాటి నుంచి కూడా వ‌సూళ్ల ప‌రంగా బాల‌కృష్ణ సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తూ వ‌చ్చాయి. టాప్ హీరోగానే ఎలివేట్ అవుతూ వ‌చ్చారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం బ్యాగ్రాప్‌తో వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. 

 

బాలయ్య సినిమా అంటే ఇప్ప‌టికీ భారీ అంచ‌నాలుండ‌టం తెలిసిందే. సింహాతో ఆయ‌న స‌త్తా ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించారు. అయితే ఇంత పాపులారిటీ వ‌చ్చినా..యాడ్స్ చేస్తే కోట్ల రూపాయాలు సంపాదించుకునే అవ‌కాశం ఉన్నా... బాల‌కృష్ణ మాత్రం న‌టించ‌లేదు. బాలకృష్ణకు పలు యాడ్‌ సంస్థలు ఆయనకు భారీ రేటును ఆఫర్ చేసినప్పటికీ.. ఆయన వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వ‌స్తున్న‌ట్లు వార్తలు వినిపిస్తుంటాయి. అస‌లు ఎందుకు యాడ్‌లలో నటించకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాడ్‌లలో నటించకూడదన్నది తన తండ్రి నిర్ణయమని చెప్పారు. 

 

ఏదైనా బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం వలన అభిమానులు వాటిని కొనుగోలు చేస్తుంటారని, కానీ అది చాలా తప్పని ఎన్టీఆర్ తమకు తరచుగా చెప్తూ ఉండేవారని బాలయ్య తెలిపారు. తండ్రి చెప్పిన మాట‌లు త‌న‌కు ఎప్పుడూ గుర్తుకు వ‌స్తుంటాయ‌ని పేర్కొన్నారు. అందుకే తాను యాడ్ చేయ‌డానికి చాలా దూరంగా ఉంటున్నాని తెలిపారు.  బుధవారం బాలయ్య తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: