కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తున్నారు. అయితే హెయిర్‌ కట్‌ లాంటి కనీస అవసరాలకు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో అవి కూడా ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు.

 

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్ ఖేర్ తన హెయిర్‌కు సంబంధించి ఆసక్తికర కామెంట్ చేశాడు. తనకు సోదరుడు హెయిర్‌ ట్రిమ్ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన అనుపమ్‌ ఖేర్ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. మాకు బట్టతల లేదు. మా జుట్టు కంటే మేం ఎత్తుగా ఉన్నాం అంతే అంటే కామెంట్ చేశాడు అనుపమ్‌ ఖేర్‌. అంతేకాదు ఇలా ఉండటం వల్లే హెయిట్ కట్‌ చాలా త్వరగా అయిపోయింది అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

 

ఇటీవల చాలా కాలం పాటు విదేశాల్లో ఉండి వచ్చిన అనుపమ్‌ ఖేర్‌ అక్కడ పలు వెబ్‌ సిరీస్‌లలో నటించాడు. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఆయన ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా తన స్టైల్‌లో స్పందిస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు అనుపమ్‌ ఖేర్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“We are not bald. We are just taller than our hair!!” That was a quickest haircut. 😎🤓 #Brothers #JaldiHoGaya @rajukherofficial

A post shared by Anupam Kher (@anupampkher) on

మరింత సమాచారం తెలుసుకోండి: