తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడు అంటే వినపడే పేరు రామ్ గోపాల్ వర్మ..ఊరికే కారణం లేకుండా అందరిపై  రెచ్చిపోయి అయిందానికి కానిదానికి నోరు పారేసకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం చెప్పన్నక్కర్లేదు.. అలా చేయడంతో వర్మ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.. తనకు నచ్చిన నచ్చకపోయినా కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి  అంటే అందులో ఇదొక అంశాన్ని చూపిస్తూ విమర్శించడం ఆయన నైజం. 

 

 

ఇకపోతే వర్మ దర్శకత్వం వహించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఇటీవల విడుదల అయ్యి విమర్శలు అందుకుంది. అంతేకాదు టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురైయ్యాడు. ఆ సినిమా గురించి పూర్తిగా జనాలు మరువక ముందే ఆ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు వర్మ.. ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. 

 

 

ఇది ఇలా ఉండగా ఇపుడు మరో వివాదానికి తెరలేపాడు. ఇప్పటికే పలు వివాదాస్పద కథాంశాల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించిన వర్మ... ఈసారి ఏకంగా మహాత్మాగాంధీని జీవితాధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

 

 

అంతేకాదు, తన తాజా చిత్రానికి సంబంధించి పోస్టర్ ను కూడా ట్విట్టర్ను వేదికగా చేసుకొని విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మహాత్మాగాంధీ, నాథూరామ్ గాడ్సేల ఫొటోలను కలిపి ఒకటిగా పెట్టారు. దీని గురించి వర్మ చెబుతూ, 'ఈ రెండు ఫొటోలను ఇలా ఒకటిగా విలీనం చేయడం వెనుక వున్న ఐడియా ఏమిటంటే, గాంధీని చంపడం అంటే గాడ్సే తనను తాను చంపుకోవడం అన్నమాట..  అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం ఎంత వివాదాస్పదం అవుతుందో .. ఎన్ని గొడవలకు దారీ తీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: