ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది అనే ప్రచారం జరిగినా సరే మళ్ళీ కూడా ఆయన సినిమాలకు బోయపాటి శ్రీను సినిమాతో ఊపు వస్తుంది అని ఆయన అభిమానులతో పాటుగా సినీ పరిశీలకులు కూడా అంటున్నారు. ఆయన చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా స్పష్టత లేదు. ఇక ఆయన చేసే సినిమాల విషయంలో నిర్మాతలు కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నారు. నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో భయపడుతున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒక యువ దర్శకుడి తో సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. ఆయన యువ దర్శకుడి తో సినిమా చేయడానికి గానూ ఇప్పటికే సిద్దమయ్యాడు అని సమాచార౦. దీనికి సంబంధించిన కథ కూడా సిద్దంగా ఉందని అయితే కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ కొన్ని కొన్ని మార్పులు చెప్తున్నారు అని వాటిని మార్చే సూచనలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమాను గ్రామీణ నేపధ్యంలో తీసుకొచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

 

మరి కథ ఏ విధంగా ఉంటుంది నిర్మాత ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. ఎప్పుడు ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది అనేది కూడా ప్రస్తుతం చెప్పడం కష్టమే. బోయపాటి శ్రీను సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మరి ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణసినిమా కోసమే ఎక్కువగా కష్టపడుతున్నారు. తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమా చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: