టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. బాబు సినిమాలు అనగానే జనాలకు ఒక పిచ్చి అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అతను అరఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది వరకు ప్రేక్షకుల ముందుకు రావడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కష్టమే అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఈ సినిమా కోసం అటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది మన తెలుగు లో అని చెప్పాలి. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తారక్ అభిమానుల్లో అసహనం పెరుగుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. తారక్ అభిమానులు అతని సినిమాల కోసం దాదాపు రెండేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. రెండేళ్ళ క్రితం విడుదల అయిన అరవింద సమేత తర్వాత తారక్ ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు అనే చెప్పాలి. దీనితో అతని ఫాన్స్ కాస్త ఆగ్రహంగా ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది.రాజమౌళి తో ఏ హీరో సినిమా చేసినా సరే ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. 

 

అతని తో తారక్ మరో సినిమా చేయకుండా ఉండటం మంచిది అనే సలహాను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం చేసే సినిమా తర్వాత తారక్ భవిష్యత్తులో మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పవద్దు అని వారు విజ్ఞప్తి చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కథలో మార్పులు కూడా చిత్ర యూనిట్ చేస్తుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: