'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్. తెరకెక్కుతున్న తరుణంలో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదే సమయంలో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుండి వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. గత ఏడాది సినిమా ప్రారంభించిన టైములో ఏకంగా డైరెక్టర్ రాజమౌళి జూన్ 30వ తారీఖున సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. డేట్ ఫిక్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయటం జరిగిందో లేదో షూటింగులో హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కి మరియు రామ్ చరణ్ కి గాయాలు అవ్వడం కొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడటం జరిగింది.

IHG

అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ విషయంలో చాలా ఆలస్యం అవటంతో సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా మళ్లీ ఆర్.ఆర్.ఆర్. సినిమా షూటింగ్ ఆగిపోవటం అందరికి తెలిసిందే. కాగా లాక్ డౌన్ టైంలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ లో రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది.

IHG

ఆ వీడియో లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రామ్ చరణ్ బాడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ పుట్టినరోజు వచ్చినా గానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా యూనిట్ అంతా ఇంట్లో ఉండటంతో ఎటువంటి వీడియో గాని రిలీజ్ చేయలేకపోయారు. ఇదిలాఉండగా త్వరలో ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి వీడియో రిలీజ్ చేయనున్నట్లు… జూలై మాసంలో సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు, ఈ మధ్యలోనే ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు ఎక్కువగా జూలై మాసంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలు కావడంతో ఎన్టీఆర్ లుక్ కూడా జూలై మాసం లో రిలీజ్ చేయాలి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: