బాలక్రిష్ణ నందమూరి వంశానికి రెండవ తరం నట వారసుడు, ఆయన నాలుగు దశాబ్దాలుగా  సీనియర్ ఎన్టీయార్  లెగసీని  ముందుకుతీసుకెళ్తున్నారు. ఇపుడు మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రాం ఉన్నారు. అయితే బాలక్రిష్ణ మాత్రం తన కుమారుడినే  మూడవ తరం వారసుడిగా ఉండాలనుకుంటున్నారు. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో బాలయ్య మాట్లాడిన మాటలు చూస్తూంటే ఆయన కుమారుడు మోక్షజ్ణ మూడవ తరం వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికీ నందమూరి వంశంలో మూడవతరం హీరోగా అల్రెడీ  జూనియర్ ఎన్టీయార్ అగ్రభాగాన ఉన్న సంగతి తెలిసిందే.

IHG

ఆయన యంగర్ జనరేషన్లో టాప్ రేంజి హీరోగా ఉన్నారు. మరి ఆయన్ని బాలయ్య గుర్తించలేదా... లేక తన కుమారుడే అసలైన వారసుడు అని భావిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బాలయ్య బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ ట్వీట్ చేసి బాబాయ్ కి గ్రీట్ చేశారు. ఆయనే తన మొదటి హీరో అని కూడా అన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మంచి కధ దొరికితే జూనియర్ ఎన్టీయార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని బాలయ్య చెప్పారు. మరి ఆ ముచ్చట ఎపుడు తీరుతుందని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే బాలయ్య ఇక్కడో మెలిక పెట్టారు. సినిమా కధ బాగుండాలని, మల్టీ స్టారర్ అంటే ఏదో చేశామని ఉండకూడని కూడా అన్నారు.

IHG

మరి మంచి కధ ఎపుడు వస్తుంది. అది బాలయ్యకు నచ్చుతుందా ఈ కాంబో పట్టాలెక్కేది ఎపుడు అన్నది ఇపుడు ఫ్యాన్స్ లో పెద్ద చర్చగా ఉంది. ఏది ఏమైనా బాలయ్య మాత్రం జూనియర్ ఎన్టీయార్ విషయంలో ఇంకా కొన్ని పట్టింపులతో ఉన్నట్లుగానే అంటున్నారు. మరో వైపు జూనియర్ మెగా క్యాంప్ తో రాసుకు పూసుకు తిరగడం కూడా కొంత ఎడం పెంచుతోందని అంటున్నారు చూడాలి ఈ కలయిక కలగానే ఉంటుందా లేక నిజమవుతుందా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: