మ్యాచో హీరో గోపిచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో చిత్రం సీటీమార్. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రంలో తమన్నా, తెలంగాణ కబడ్డీ టీంకు కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు. 

 

 ఇక రేపు గోపిచంద్ తన పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా సీటీమార్ టీం ఓ అదిరిపోయే సప్రైజ్ ను ప్లాన్ చేసింది. బహుశా టీజర్ కానీ విడుదలచేస్తారేమో చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు 60శాతం షూటింగ్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 
ఇక లౌక్యం తరువాత హిట్ లేని గోపిచంద్ ,ఈ సీటీమార్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇంతకుముందు గోపిచంద్, సంపత్ నందితో గౌతమ్ నంద అనే సినిమా చేయగా ఆచిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా బాగున్నా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరిప్పుడు సీటీమార్ తోనైనా వీరిద్దరు హిట్ కొడతారో  లేదో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత గోపిచంద్, తేజ తో అలివేలు మంగ వెంకటరమణ అనే సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది. ఇంతకుముందు తేజ డైరెక్షన్ లో గోపిచంద్, జయం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: