షూటింగ్ లకు అనుమతులు లభించడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అలియా భట్ డేట్స్ ను పక్కకు పెట్టి ఈ మూవీలో చరణ్ జూనియర్ లపై చిత్రీకరించ వలసిన సీన్స్ విషయమై రాజమౌళి తన టీమ్ తో చాల లోతుగా చర్చలు కొనసాగిస్తున్నాడు.


ఈ పరిస్థితులలో ఒక ఆసక్తికర గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. తిరిగి షూటింగ్ లు ప్రారంభం కావడానికి జరిగిన రాయబారాలకు నాయకత్వం వహించిన చిరంజీవి తాను ఎక్కడికి వెళ్ళినా తన టీమ్ లో రాజమౌళి ఉండేవిధంగా వ్యవహరించాడు. అదేవిధంగా ఈమధ్య చిరంజీవి టీమ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు కూడ రాజమౌళిని జగన్ కు పరిచయం చేస్తూ అతడి గురించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.


దీనితో చిరంజీవి ప్రతిచోట తన టీమ్ లో రాజమౌళిని తన వెంట పెట్టుకుని వెళ్ళడమే కాకుండా ప్రశంసలు కురిపిస్తూ పరిచయాలు చేయడంతో జక్కన్న మంచి జోష్ లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఆనందాన్ని గ్రహించిన చిరంజీవి చాల వ్యూహాత్మకంగా వ్యవహరించి తన ‘ఆచార్య’ కోసం రాజమౌళి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య చిరంజీవి రాజమౌళితో ‘ఆచార్య’ మూవీ విషయం ప్రస్తావిస్తూ చరణ్ ప్రత్యేక పాత్ర విషయంలో రాజమౌళి సహాయం కోరినట్లు టాక్. అప్పటికే చిరంజీవి తనకు ఇస్తున్న గౌరవానికి పొంగిపోతున్న రాజమౌళి చిరంజీవి అభ్యర్థనను మన్నించి షూటింగ్ లు మొదలయ్యాక ముందుగా చరణ్ జూనియర్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అదేవిధంగా చరణ్ పై మిగిలి ఉన్న సీన్స్ పూర్తిచేసి ఆతరువాత తన బంధిఖాన నుండి చరణ్ కు మోక్షం కలిగిస్తానని చిరంజీవికి మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలే నిజం అయితే చిరంజీవి చాల తెలివిగా ‘ఆచార్య’ విషయంలో చరణ్ కు సంబంధించిన అడ్డంకులను తొలిగించుకున్నాడు అని అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: