తమిళ నటుడు సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. గజిని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సూర్య, ఆ తర్వాత తన ప్రతీ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సూర్య సినిమాలకి తెలుగులో సరైన రెస్పాన్స్ రావడం లేదు. గ్యాంగ్ చిత్రం నుండి మొదలుకుని, ఎన్జీకే, బందోబస్త్ మొదలగు చిత్రాలన్నీ ఇక్కడ ఫ్లాప్ బాట పట్టాయి. బందోబస్త్ చిత్రమైతే తమిళంలో విజయం సాధించినా ఇక్కడ మినిమమ్ వసూళ్ళు కూడా సాధించలేకపోయింది.

 

దాంతో తెలుగులో సూర్య మార్కెట్ బాగా పడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అవన్నీ పక్కన పెడితే సూర్య ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా అనే చిత్రంలో నటించాడు. లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాకి దర్శకత్వం వహించిన సుధ, సూర్యతో ఆకాశం నీ హద్దురా అంటూ మన ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు.

 


ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి స్పందన లభించింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ కానుంది. పిల్లా పులి అనే పాటకి వచ్చిన రెస్పాన్స్ ఈ విషయాన్ని క్లియర్ గా తెలుతుంది. అంతే కాదు ఈ మధ్యే సెన్సార్ కి వెళ్ళిన ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది.

 

అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు సూర్య నటనకి ఫిదా అయ్యారట. దాంతో చిత్రబృందం చాలా హ్యాపీగా ఉంది. అటు టీజర్, పాటలు, సెన్సార్ సభ్యుల మాటలు.. అన్నీ చూస్తుంటే సూర్య ఈ సారి గట్టిగా కొట్టేలా కనబడుతుంది. ఈ సినిమాతోనైనా సూర్య మళ్ళీ తెలుగులో మార్కెట్ ని పెంచుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రంలో ఒకానొక ప్రధాన పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: