టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి, మరికొద్ది రోజుల్లో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్ ని పెళ్ళి చేసుకుని, ఫ్యామిలీ మ్యాన్ గా మారబోతున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ మెరిసిన రానాకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రయినా చేయగల సామర్థ్యం అతని సొంతం.

 

అందుకే వెర్సటైల్ యాక్టర్ గా పిలవబడుతున్నాడు. తన మొదటి సినిమా లీడర్ తో తానెంత విలక్షణమో చూపించాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన ఇమేజ్ పెంచుకున్న రానా, ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. పాపులారిటీ కోసమో, మాస్ ఇమేజ్ కోసమో ప్రయత్నించకుండా చక చకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం రానా చేతిలో అరణ్య, విరాట పర్వం చిత్రాలున్నాయి.

 

ఈ రెండు చిత్రాల్లో అరణ్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ ఉంది. విరాట పర్వం చిత్రం దాదాపుగా 90శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు చిత్రాలు రెండు విభిన్న కథాంశంతో తెరకెక్కాయి. విరాట పర్వం సినిమా తెలంగాణ ప్రాంతంలోని నక్సలైట్ల కాలంనాటి కథతో తెరకెక్కగా, అరణ్య చిత్రం ప్రకృతిలో మనుషులతో పాటు జంతువులు కూడా భాగమే అని చెప్పే కథగా తెరకెక్కింది.

 

అయితే అరణ్య సినిమా కోసం ఎక్కువగా అడవుల్లోనే గడపాల్సి వచ్చిందట. సుమారు ముఫ్పై ఏనుగులని ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఏనుగులతో సహచర్యం చేసే పాత్రలో రానా కనిపిస్తాడట. అయితే అందులో భాగంగా రానా ఏనుగు తొండాన్ని భుజాన వేసుకుని మోయాల్సి వచ్చిందట. 160- 170 కేజీల బరువుండే ఏనుగు తొండాన్ని మోయడం చాలా కష్టంగా అనిపించేదట. బాహుబలి సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అలాంటి కష్టమే అరణ్య సినిమా కోసం పడ్డాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: