మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎక్కువగా మాస్ మూవీసే ఉంటాయి. ఆయన మాస్ ఇమేజ్ కి డ్యాన్స్, ఫైట్స్ తోపాటు కామెడీ టైమింగ్ కూడా ఓ కారణం. కమెడియన్లు ఉన్నా వారిని డామినేట్ సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి పండించిన హాస్యం కూడా భాగమై విజయం సాధించిన సినిమాలున్నాయి. అలా.. హీరోగా చిరంజీవి పూర్తిస్థాయిలో హస్యం పండించిన సినిమా ‘చంటబ్బాయి’. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ స్థాయిని చెప్పిన సినిమాగా చంటబ్బాయికి పేరు ఉంది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తారు.

IHG

 

అసిస్టెంట్ సుత్తివేలుతో కలసి చిరంజీవి చేసిన కామెడీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘పాండ్.. కాల్ మీ మిస్టర్ పాండ్’ అంటూ పిస్టల్ పట్టుకుని తనదైన స్టైల్లో నవ్వించారు. ఓ హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది. సుహాసిని వస్తే ఎలా మాట్లాడాలి.. అనుకుంటూ ఆయన ప్రాక్టీస్ చేసే సన్నివేశం.. ఆ సమయంలో సుహాసిని అక్కడే ఉండటంతో ఆయన చూపే హావభావాలు సినిమాకే హైలైట్. ఈ సినిమాతో అప్పట్లో చిన్నపిల్లలను విశేషంగా ఆకట్టుకున్నారు. ‘ఎంటర్ టైన్మెంట్ కోసం చిరీంజీవి సినిమాకి వెళ్లాలి’ అని ఆడియన్స్ ఫీలయ్యేలా చేసిన సినిమాల్లో చంటబ్బాయికి స్థానం ఉంది.

IHG

 

ఆ సమయంలో చిరంజీవి సుప్రీం హీరో ఇమేజ్ తో మాస్, యాక్షన్ సినిమాలతో స్టార్ హీరోగా ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవితో కామెడీ సినిమా ప్లాన్ చేయడం సాహసమే. కానీ.. చిరంజీవిలోని కామెడీ యాంగిల్ గుర్తించారు జంధ్యాల. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ ‘చంటబ్బాయి’లో చిరంజీవి ఒన్ మ్యాన్ షో చేశారు. ఆడియన్స్ చిరంజీవి సినిమాల్లో కామెడీని ఆశించడం ఈ సినిమాతోనే మొదలైంది. చార్లీ చాప్లీన్, అమ్మాయి గా.. పలు వేషాల్లో చిరంజీవి తనదైన హస్యాన్ని పండించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: