మన తెలుగులో కథలకు ఏ మాత్రం కరువు లేదు అని చాలా మంది స్టార్ హీరోలు అంటూ ఉంటారు. అగ్ర హీరోలకు అయినా చిన్న హీరోలకు అయినా సరే మంచి మంచి కథలు దొరుకుతాయి అని అంటారు. అయితే మన తెలుగులో మాత్రం ఇక్కడ ఉన్న రచయితలు రాసే కథలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా బయట వారు రాసే కథలకు యెనలేని ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను చేస్తూ ఉంటారు, ఈ విషయం అందరికి తెలిసిందే. ఇతర భాషల్లో రీమేక్ అయిన సినిమాలను తెలుగులో తీసుకుని వచ్చి ఇక్కడికి తగిన విధంగా కథను మార్చే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. 

 

ఇప్పుడు దాదాపుగా అందరు స్టార్ హీరోలు కూడా అదే విధంగా సినిమాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇతర భాషల కథల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని సమాచారం. అక్కడి కథలు హిట్ అయితే వాటిని ఇక్కడికి తీసుకుని వచ్చి సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు. చిరంజీవి అదే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్ అదే ఆలోచనలో ఉన్నారు మహేష్ బాబు ఒక్కడే ఇక్కడి కథలతో సినిమా. పవన్ కళ్యాణ్ కూడా ఇతర భాషల సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. 

 

అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఈ ఫార్ములా ను ఎక్కువగా ఫాలో కావడం టాలీవుడ్ లో జనాలకు చాలా రకాలుగా చికాకుగా ఉంది అని సమాచారం. ఇలాంటివి చేస్తే ఇక్కడి దర్శక రచయితలు బాగా ఇబ్బంది పడతారు అని ఇలాంటివి చేయడం మంచిది కాదు అని పలువురు హెచ్చరిస్తున్నారు. అందుకే స్టార్ హీరోలు ఇప్పుడు స్టార్ రచయితల వెంట పడుతున్నాడు. మరి ఎంత వరకు ఇక్కడి కథలతో సినిమాలు చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: