టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమెకు ఇప్పటికి కూడా ఏ మాత్రం డిమాండ్ అనేది తగ్గలేదు అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా ఆమె యువ హీరోయిన్ లను దాటుకుని మరీ సినిమాలు చేస్తూ ముందుకు  వెళ్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చాలా వరకు ఆమె ఒకటికి వంద సార్లు ఆలోచించి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ఇప్పుడు పారితోషికం విషయంలో ఆమె పేరు వింటే భయపడే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అని అంటున్నారు జనాలు. 

 

ఆమె ఏ మాత్రం కూడా జాలి దయ అనేది లేకుండా ఎక్కువగా డిమాండ్ చేస్తుంది అని సమాచారం. అగ్ర హీరోల సినిమాలకు అయితే కనీసం ఆరు కోట్ల వరకు అడుగుతుంది అని తెలుస్తుంది. మొన్నా మధ్య నిర్మాతలు ఆమెను పక్కన పెట్టాలి అని కూడా చూసారు. కాని స్టార్ హీరోలు చాలా మంది ఆమె తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం తో చేసేది లేక ఆమెతో సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఆమె లిప్ లాక్ అయినా మరోకటి అయినా సరే ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా సినిమాలను చేస్తుంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

 

అందుకే ఇప్పుడు ఆమెకు ఆ విధంగా క్రేజ్ ఉంది అని సమాచారం. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.  ఆ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా అపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మాత్రం సినిమాలు చెయ్యాలి అంటే ఏ విధంగా కుడా వెనక్కు తగ్గే ఆలోచనలో లేదు అని సమాచారం. మరి ఏ విధంగా ఆమె తో సినిమాలు చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: