మన తెలుగులో చాలా తక్కువ కాలంలో చాలా మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరో అల్లరి నరేష్. అతని సినిమా వస్తుంది అంటే కచ్చిత౦గా ప్రేక్షకులు హాల్ కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండేది అప్పట్లో అనేది వాస్తవం. స్టార్ హీరోల సినిమాలకు ఉండే డిమాండ్ కూడా తానికి ఉండేది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం  లేదు. అతని తో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపించే వారు. తక్కువ బడ్జెట్ సినిమాలు కావడం తో ఏ ఇబ్బంది ఉండేది కాదు అనే భావన లో నిర్మాతలు కూడా ఉండి అతని తో సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అతనికి స్టార్ హీరోలు తమ సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అతను సర్కారు వారి పాట సినిమాలో కచ్చితంగా నటించే అవకాశం ఉంది అని టాక్. అదే విధంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో అతనిని తీసుకునే అవకాశం ఉంది అని కూడా సమాచారం. దీనికి సంబంధించి అతను ఇప్పుడు ఎక్కువగా తన బరువుని పెంచుకునే ప్రయత్నావు ఉన్నాడు అని కూడా  అంటున్నారు. దీనిపై త్వరలోనే అతను మహేష్ ని కూడా కలిసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. 

 

సినిమా షూటింగ్ ని ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక అగ్ర హీరోలకు అతను ఫ్రెండ్  గానే కాకుండా నటన పరంగా చూసినా సరే సినిమాకు ప్లస్ అవుతాడు అని అందుకే అతన్ని సినిమాల్లో తీసుకోవదానికివారు ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి ఏయే స్టార్ హీరోల సినిమాల్లో అతను కనపడతాడు అనేది చూడాలి. ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాటను లాక్ డౌన్ తర్వాత సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: