చిన్న చిన్న హీరోలకు అవకాశాలు ఇచ్చే విషయంలో అగ్ర దర్శకులు ఇప్పుడు చాలా దూకుడుగా ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చిన్న హీరోలతో సినిమాలు చేయడం చాలా మంచిది అనే భావన లో ఇప్పుడు స్టార్ దర్శకులు ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ లో. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఉండే భయాలు చిన్న హీరోల సినిమాల విషయంలో ఏ మాత్రం కూడా ఉండే అవకాశం లేదు అనేది వాస్తవ౦. ఎందుకు అంటే చిన్న చిన్న హీరోలు ఎక్కువగా డిమాండ్ చేయరు ఒకటి అయితే రెండు నిర్మాత నుంచి ఒత్తిడి ఉండే అవకాశం  దాదాపుగా ఉండదు. 

 

చిన్న చిన్న హీరోల సినిమాల విషయంలో ఏ ఆందోళన కూడా అవసరం లేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే త్రివిక్రమ్ సహా కొందరు హీరోలు ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే అతను నానీ లేదా శర్వా తో సినిమా చేయడానికి గానూ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

 

చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇప్పుడు బాగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచార౦ అయితే జరుగుతుంది మరి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఇదే విధంగా వ్యావహరిస్తున్నారు అని సమాచారం. ఆయన చిన్న చిన్న హీరోలతోనే సినిమాలు చేయడం మంచిది అనే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. రాజమౌళి కూడా అదే బాటలో ఉన్నారు అని సమాచారం. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: