క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ క‌రోనా భూతానికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాటం చేస్తూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న ఈ సమయంలో బయటకి వెళ్లి పని చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందుల వలన కొందరు తప్పని పరిస్థితులలో పనులు చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంటి పట్టునే ఉంటున్నారు. 

IHG's film tests ...

ఈ క్ర‌మంలోనే క‌రోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తిచెందుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఆదుజీవితం చిత్రం షూటింగ్‌ కోసం మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ లాక్‌డౌన్ కార‌ణంగా జోర్దాన్ ఎడారిలో చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఈయనతో పాటు చిత్ర యూనిట్ మొత్తం 58 మంది కూడా అక్కడే ఉన్నారు. వాళ్లు మూడు వారాలుగా అక్కడే ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్నామంటూ పోస్ట్ కూడా చేసాడు పృథ్వీ. ఈ క్రమంలో తమను ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా చిత్ర దర్శకుడు కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్‌ చాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పరిస్థితి అంతగా బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

IHG

దీంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్‌ ఇండియా విమానంలో వారంద‌రిని ఇండియాకి తీసుకొచ్చారు. జోర్డాన్‌లో క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వీరంద‌రిని క్వారంటైన్‌లో ఉంచారు.  14 రోజుల తర్వాత  పృథ్వీరాజ్ కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. అందుకు సంబంధించిన రిపోర్ట్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. కానీ, ఈ చిత్ర టీమ్‌లో ఇద్దరికి తాజాగా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలడం షాక్ కు గురి చేస్తోంది. 58 ఏళ్ళ వ్యక్తితో పాటు ఓ యువకుడు కరోనా సోకిన వారిలో ఉన్నారు.  ప్రస్తుతం వీరిద్దరికి క‌రోనా సోక‌డంతో.. చిత్ర టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: