కరోనా మహమ్మారి ప్రజా జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ప్రజలు గతంలోలా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో చాలా పనులు సొంతంగా చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. లాక్ డౌన్‌ మొదలైన తరువాత చాలా మంది తారలు హీరోయిన్లు తమ భర్తలకు కటింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. హీరోలు కూడా తమ భార్యలతో కటింగ్ చేయించుకున్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఇన్స్‌పైర్‌ చేస్తున్నారు.

 

తాజాగా అదే బాటలో మరో అందాల భామ కూడా తన భర్తకు కటింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బిజినెస్‌ ఉమెన్‌గా దూసుకుపోతున్న అందాల భామ ప్రీతీ జింటా. లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ తాజాగా తన భర్త జీనీ గుడ్ఎనఫ్‌కు హెయిర్ కట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది.

 

వీడియోతో పాటు `నాకు తెలుసు అతను నన్ను హెయిట్ కట్‌  చేయమన్నప్పుడు నన్ను ఎంతో నమ్ముతాడని. అందుకే ఆ నమ్మకం అలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఒక వేళ అల జరగపోతే పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని నేను ఊహించలేకపోతున్నా. గుడ్‌ ఎనఫ్‌కు గుడ్‌ ఎనఫ్‌ హెయిర్‌ కట్ కుదరాలని ప్రార్థిస్తున్నా` అంటూ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: