ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించిన ఆమె ఎవరో గుర్తున్నారా మీకు. అదేనండి అటు కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ గుర్తింపును పొందిన కథానాయిక ఐశ్వర్య రాజేష్. నిజానికి ఆమెకు ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ ఆమె ఎంతో పట్టుదలతో శ్రమతో కృషితో చిత్రపరిశ్రమలో భాగా నిలదొక్కుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోని ఏకంగా 140000 మంది లైక్ చేశారు. అంతేకాకుండా అనేక మంది అనేక స్టైల్లో ఆమెని మీ లుక్ అదుర్స్ అంటూ ఫాలోవర్స్ కామెంట్ చేశారు.
అయితే ఇదే నేపథ్యంలో వ్యక్తి ఐశ్వర్య పై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ ఓ కామెంట్ చేశాడు అభిమాని. అతడి ఏమని రాసుకోచ్చాడంటే త్రిపురలో నేను మీకు ఓ వీరాభిమాని. " నీకోసం నేను ప్రాణాలు కూడా ఇచ్చేస్తా... మీ నటన అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలో మీ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజంగా మీరు అంటే నాకు చాలా ఇష్టం. అక్క " అని పోస్ట్ చేశాడు.
అయితే దీనికి నటి ఐశ్వర్య సమాధానమిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని ఆమె తెలియజేసింది. అంతేకాకుండా ... " ధన్యవాదాలు. కానీ దయచేసి అలా మాట్లాడవద్దు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మన జీవితం జీవించలేదు. నువ్వు సంతోషంగా ఉన్నాను అని చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే నేనెప్పుడూ నీకు మంచి స్నేహితురాలిగా ఉంటా. జాగ్రత్త " అని ఆమె రాసుకోచ్చారు.